ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:19 AM
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం మొదలైంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ‘సంతోషాల ఈద్’ అని ఖర్గే అభివర్ణించారు.
ఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం మొదలైంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ‘సంతోషాల ఈద్’ అని ఖర్గే అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ (BJP) నేతలు ధ్వజమెత్తారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పవిత్ర పండుగలను కూడా రాజకీయాలకు వాడుకుంటోందని కాషాయం పార్టీ నేతలు దుయ్యబట్టారు.
ఖర్గే చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందూ భక్తుల విశ్వాసాలను, భావోద్వేగాలను గాయపరిచేలా ఉన్నాయని ఆగ్రహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను ‘యాంటీ-సనాతన‘, ‘యాంటీ-హిందూ’ పార్టీగా కమలం పార్టీ నేతలు అభివర్ణించారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ, మహా కుంభమేళా, ఛత్ పూజలపై కాంగ్రెస్ నేతలు గతంలో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ విరుచుకుపడ్డారు. పండుగల వేళ ప్రజలంతా విభేదాలను మరచి ఐక్యంగా ఉండాలని, దేశ శాంతిభద్రతలను కాపాడాలని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి
సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News