Share News

ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:42 AM

ప్రైవేట్ రంగంలో పనిచేసే పురుషులకు కూడా వేతనంతో కూడిన పెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహాత్కర్ (NCW) సిఫార్సులు చేశారు.

ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు
Paid Paternity Leaves

ఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ రంగంలో పనిచేసే పురుషులకు కూడా వేతనంతో కూడిన పెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహాత్కర్ (NCW) సిఫార్సులు చేశారు. పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వానికి 37 కీలక సిఫార్సులను చేశారు. ‘పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు ఉద్యోగానికి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం రాకూడదు. సమాన బాధ్యత తీసుకుంటేనే ఇది సాధ్యం’ అని విజయ రహాత్కర్ పేర్కొన్నారు.


ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తండ్రులకు కూడా వేతనంతో కూడిన పెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని విజయ రహాత్కర్ సూచించారు. ప్రసూతి ప్రయోజనాలు, చైల్డ్‌కేర్ మౌలిక వసతులు, కార్యాలయాల్లో వివక్ష నివారణ వంటి 9 కీలక విభాగాలపై పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ, కార్మిక, WCD మంత్రిత్వ శాఖలకు విజయ రహాత్కర్ నివేదిక సమర్పించారు. భాగస్వామ్య వర్గాలతో విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు స్పష్టం చేశారు. తల్లి అన్న కారణంగా మహిళల కెరీర్‌కు ఆటంకం కలగవద్దని అన్నారు. పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి సమాన బాధ్యత అని విజయ రహాత్కర్ ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి

సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 12:16 PM