ప్రతి చుక్క నీటికీ లెక్క..‘ధారా’తో బిల్లు పక్కా !
ABN , Publish Date - Nov 10 , 2026 | 10:07 AM
ఎల్‌నినో దెబ్బకు నగరంలో శీతాకాలానికే నీటి ఎద్దడి వచ్చేసింది. ప్రభుత్వ నీటి సరఫరా లెక్కలూ మారాయి. వృథాను అరికట్టండి.. అంటూ అపార్ట్‌మెంట్‌లలో బోర్డులు వెలుస్తున్నాయి.
నీటి వాడకం లెక్కలు తీస్తున్న అల్ట్రాసోనిక్ స్మార్ట్ వాటర్ మీటర్
అపార్ట్‌మెంట్‌లలో నీటిలెక్కలు తేలుస్తున్న ‘కృత్స్నం’
సంక్షోభ వేళ నీటి వృథాకు స్మార్ట్ సాంకేతికతతో చెక్ !
హైదరాబాద్ సిటీ: ఎల్‌నినో దెబ్బకు నగరంలో శీతాకాలానికే నీటి ఎద్దడి వచ్చేసింది. ప్రభుత్వ నీటి సరఫరా లెక్కలూ మారాయి. వృథాను అరికట్టండి.. అంటూ అపార్ట్‌మెంట్‌లలో బోర్డులు వెలుస్తున్నాయి. బోరుబావులు అడుగంటిపోతుండటంతో అపార్ట్‌మెంట్లలో నీటి వినియోగంపై వివాదాలు తీవ్రమవుతున్నాయి. అయితే ప్రతి నీటిబొట్టుకు ఇకపై పక్కాగా లెక్కలు తేలుస్తామంటూ కృత్స్నం సంస్థ ముందుకు వచ్చింది. ఈ లెక్కలు తేల్చేందుకు అలా్ట్రసోనిక్ స్మార్ట్ వాటర్ మీటర్‌ను తెరపైకి తెచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా..
గ్రేటర్‌లో ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబరు వరకూ తీసుకుంటే దాదాపు 8.4 లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఇందుకు ఇప్పటి వరకు రూ.40కోట్లకు పైగానే నగరవాసులు నీటి కోసం ఖర్చు చేశారని అంచనా. ‘వ్యాపారంలో మనం ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది. మరి నీటి వినియోగానికి ఎందుకు లెక్క ఉండకూడదు..’ అనే ఆలోచనతో ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభమైన కృత్స్నం స్టార్టప్ ఇప్పుడు నగర వేదికగా తమ సొంత వాటర్ మీటర్లనూ తయారుచేస్తోంది. ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభమైన ఈ స్టార్టప్, ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సొంతంగా స్మార్ట్ వాటర్ మీటర్లను తయారు చేస్తోంది. సంస్థ వ్యవస్థాపకులు శ్రీహర్ష, వినయ్ చాటరాజు, పృథ్వీ సాగర్ అనగాని, నీరజ్ కుమార్ రాయ్‌లు ‘ధారా’ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా నివాస సముదాయాలు, పరిశ్రమలలో నీటి వాడకంపై స్పష్టమైన డేటాను అందిస్తున్నారు.
వాట్సాప్ లోనే రోజూవారీ వివరాలు!
రోజూ ఉదయాన్నే కిందటి రోజు ఏ ఫ్లాట్ ఎంత నీరు వాడిందో ‘ధారా పల్స్’ ద్వారా నేరుగా వాట్సాప్ కే లెక్కలు వచ్చేస్తాయి. ఈ అల్ట్రాసోనిక్ స్మార్ట్ వాటర్ మీటర్లు ప్రతి గంటకు నీటిప్రవాహాన్ని లెక్కిస్తుండటం విశేషం. అలాగే ఫ్లష్‌లలో లేదా ట్యాప్‌ల నుంచి చుక్కలు చుక్కలుగా కారే నీటిని, ఎక్కడ వృథా జరుగుతుందో కచ్చితంగా పసిగడుతుంది. దీనివల్ల మనం ఎంత నీటిని వినియోగిస్తున్నామో తెలుస్తుంది. ఫలితంగా అపార్ట్‌మెంట్‌లో నిర్వహణ భారం కొంతమందికి అయినా తప్పుతుంది.
ఐదేళ్ల బ్యాటరీ..
4జీ సిమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ మీటర్ బ్యాటరీ ఏకంగా ఐదేళ్లపాటు పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15వేలకు పైగా మీటర్లను బిగించినట్లు సంస్థ పేర్కొంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
‘నామినేటెడ్’పై కుదరని ఏకాభిప్రాయం?
Read Latest AP News And Telangana News And International News And Telugu News