హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:24 AM
హైదరాబాద్ నగరంలోని బోయినపల్లి 11కేవీ ఫీడర్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో చెట్ల నరికి వేత, ఏబీ స్విచ్ మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్య్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు బోయినపల్లి సీబీడీ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
బాలానగర్(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని బోయినపల్లి 11కేవీ ఫీడర్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో చెట్ల నరికి వేత, ఏబీ స్విచ్ మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్య్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు బోయినపల్లి సీబీడీ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. పార్క్ ఎవెన్యూ, గ్రీన్ వ్యూ ఎన్క్లేవ్, ఫరీద్నగర్, అబ్రార్‌నగర్, మనోవికాస్ నగర్, రిలియన్స్ విల్లా మార్ట్, రాయల్ ఎన్క్లేవ్, ఎస్బీఐ కాలనీ, ఆరావళి ఎన్‌క్లేవ్‌లో మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ వివరించారు.
రామంతాపూర్: రామంతాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వార్షిక మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గోఖలే నగర్, పీఎస్ కాలనీ, గణేష్ నగర్, చర్చి కాలనీ, దూరదర్శన్ కేంద్రం, వెంకట్ రెడ్డి నగర్, ఇందిరా నగర్, ప్రగతి నగర్, శారదా నగర్, ఆర్టీసీ కాలనీ, ఎండోమెంట్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈయూ మేఘనాదం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్పుల కుప్ప నుంచి అభివృద్ధి వైపు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News