అప్పుల కుప్ప నుంచి అభివృద్ధి వైపు..
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:56 AM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దగాపడ్డ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, సరైన దారిలో పెట్టిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు.
తెలంగాణ పునర్నిర్మాణంలోసీఎం రేవంత్ పాత్ర అమోఘం
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు రూరల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దగాపడ్డ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, సరైన దారిలో పెట్టిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం కొడంగల్‌లోని సీఎం నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధును సీఎం ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని నీలం మధు విమర్శించారు. . తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని అన్నారు. అలాంటి బాధ్యతను భుజాన వేసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం చేస్తున్న కృషి అభినందనీయమని నీలం మధు పేర్కొన్నారు.