జేఎన్‌టీయూలో ‘నిలిట్’ స్కిల్ సెంటర్
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:00 AM
ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల విద్యార్థుల విద్యకు మించిన నైపుణ్యాలను అందించాలని జేఎన్‌టీయూ యంత్రాంగం సన్నద్ధమైంది.
ఎలక్ట్రానిక్స్, ఐటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
క్యాంప్‌సలో 12వేల చదరపు అడుగుల స్పేస్
హైదరాబాద్ సిటీ: ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల విద్యార్థుల విద్యకు మించిన నైపుణ్యాలను అందించాలని జేఎన్‌టీయూ యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నిలిట్)తో అవగాహన ఒప్పందం కోసం నిర్వహించిన సంప్రదింపులు తాజాగా కొలిక్కివచ్చాయి. నిలిట్ హైదరాబాద్ స్కిల్ సెంటర్ పేరుతో జేఎన్‌టీయూ ప్రాంగణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరు సంస్థల ఉన్నతాధికారుల మధ్య అంగీకారం కుదిరింది. సుమారు 12వేల చదరపు అడుగుల స్పేస్‌ను కేటాయించాలని నిర్ణయించారు. ఈ అవగాహన ఒప్పందం పదేళ్లపాటు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్కిల్ సెంటర్ ద్వారా ఉద్యోగ అవసరాలకు కావాల్సిన సాంకేతిక కోర్సులను నిలిట్ అందించనుంది.
డిగ్రీ పూర్తి చేసేలోగా నైపుణ్య సాధన
నైపుణ్య ఆధారిత స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ లేదా ఇతర అనువైన విధానాలలో నిలిట్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వీసీ టి.కిషన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసేలోగా ఉద్యోగావకాశాలకు కావాల్సిన అన్ని నైపుణ్యాలను పొందుతారని చెప్పారు. ప్రస్తుతం అనుబంధ కళాశాల విద్యార్థులకు, భవిష్యత్తులో అఫిలియేటెడ్ కళాశాలల విద్యార్థులకు కూడా నిలిట్ ప్రయోజనాలను అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్పుల కుప్ప నుంచి అభివృద్ధి వైపు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News