Share News

మళ్లీ ఉక్కపోత.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తగ్గిన చలి తీవ్రత

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:47 PM

ఉమ్మడి జిల్లాలో మళ్లీ ఉక్కబోతలు మొదలయ్యాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.

మళ్లీ ఉక్కపోత.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తగ్గిన చలి తీవ్రత
Temperature

  • రాత్రివేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో మళ్లీ ఉక్కబోతలు మొదలయ్యాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గడిచిన వారం రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు చేరువైన విషయం తెలిసిందే. చలిగాలుల ఉధృతి పెరగడంతో సాయంత్రం నుంచి ఇంటి బయటకు వచ్చేందుకు జనం వణికిపోయారు. అయితే ఇపుడు అనూహ్యంగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగిపోయాయి.


రాత్రిపూట సగటు ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 19.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 20.1 డిగ్రీలు, మేడ్చల్‌ జిల్లాలో 20.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి. పగటిపూట 32 నుంచి 34డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గాలిలో తేమశాతం పెరిగి జనం ఉక్కబోతకు గురవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టభద్ర ఓటర్లు 6,21,086

న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 01:47 PM