Share News

‎తిరుమల శ్రీవారికి భక్తుడు వర్థమాన్‌ జైన్ భారీ విరాళం

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:50 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి 121 కేజీల 45 స్వర్ణాభరణాలు కానుకగా అందాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి చెన్నైకి చెందిన దాత వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ ఛైర్మన్ వర్థమాన్ జైన్ ఈ ఆభరణాలను అందించారు.

‎తిరుమల శ్రీవారికి భక్తుడు వర్థమాన్‌ జైన్ భారీ విరాళం
Tirumala Gold Donation

తిరుమల, నవంబర్ 26: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి 121 కేజీల 45 స్వర్ణాభరణాలు కానుకగా అందాయి. శ్రీవారికి భక్తుడు వర్థమాన్‌ జైన్ భారీ విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో చెన్నైకి చెందిన దాత వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ ఛైర్మన్ వర్థమాన్ జైన్ ఈ ఆభరణాలను టీటీడీకి అందించారు. దాదాపు రూ.200 కోట్ల 6 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను దాత విరాళంగా ఇచ్చారు.


శ్రీవారి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా కిరీటం, శంకుచక్రాలు, కటి వరహస్తాలు, వడ్డాణం, పాదుకలు ఇలా 45 రకాల ఆభరణాలను ఓ జ్యువెలరీ సంస్థ ద్వారా దాత తయారు చేయించారు. ఈ బంగారు ఆభరణాలను రంగనాయక మండపంలో ప్రదర్శనకు ఉంచారు. గతంలో టీటీడీకి ఈ దాత పలు మార్లు విరాళాలు అందజేశారు. ఈ ఏడాది మే 16న ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును వర్ధమాన్‌ జైన్ విరాళంగా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 01:01 PM