‘మంజీరా’లో ఊట బావులు..
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:10 PM
మూడు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల్లో సాగుకు ఆధారమైన మంజీరా నది చుక్క నీరు లేక బోసిపోయింది.
నాగల్‌గిద్ద(సంగారెడ్డి): మూడు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల్లో సాగుకు ఆధారమైన మంజీరా నది చుక్క నీరు లేక బోసిపోయింది. మ్చహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే మంజీరా నది ఎండిపోయి మైదానాన్ని తలపిస్తున్నది. దీంతో నది నీటిపై ఆధారపడి సాగు చేపట్టే రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మంజీర నది సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాంజన్వాడ వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 96 కి.మీలు ప్రవహిస్తుంది.
నదిలో నీటి మట్టం పూర్తిగా తగ్గడంతో నాగల్‌గిద్ద మండలానికి పొరుగున కర్ణాటకలోని కందుగుళ్ వద్ద మంజీరా నది గర్భంలో రైతులు నీటి కోసం ఊట బావులు తవ్వారు. అక్కడ ఊరుతున్న నీటిని మోటార్ల ద్వారా పొలాలకు తరలిస్తున్నారు. అక్కడి రైతులతో మాట్లాడిన ‘ఆంధ్రజ్యోతి’తో పంటలను కాపాడుకోవడానికే నదిలో ఊట బావులు తవ్వి నీటిని తరలిస్తున్నామన్నారు. అయితే నది పరివాహక ప్రాంతంలో పరిస్థితులను అధికారులు సమీక్షించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా
Read Latest AP News And Telangana News And International News And Telugu News