Share News

28న నవోదయ ఎంట్రెన్స్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:26 PM

2027-28 విద్యా సంవత్సరానికి ఈనెల 28 (శనివారం) జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టినట్లు కలెక్టర్‌ సందీప్ కుమార్‌ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

28న నవోదయ ఎంట్రెన్స్‌
JNV Entrance Exam

  • జిల్లాలో 656 మంది అభ్యర్థులు

  • నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

జనగామ: 2027-28 విద్యా సంవత్సరానికి ఈనెల 28 (శనివారం) జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టినట్లు కలెక్టర్‌ సందీప్ కుమార్‌ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ జడ్పీహెచ్‌ఎస్ (బాలురు), జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ధర్మకంచ జడ్పీ హైస్కూల్‌ (బాలురు), కొడకండ్ల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూళ్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 656 మంది అభ్యర్థులు ఆరో తరగతి ప్రవేశం కోసం ఈ పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు.


ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు అభ్యర్థులు 11 గంటల్లోపే పరీక్షా హాల్లోకి హాజరు కావాలని సూచించారు. పరీక్ష నిర్వహిస్తున్న నాలుగు పాఠశాలలకు ఈనెల 28న సెలవు ప్రకటించడం జరిగిందని దానికి బదులుగా డిసెంబర్‌ 12న రెండో శనివారం పనిదినంగా ఉంటుందని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టభద్ర ఓటర్లు 6,21,086

న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 12:26 PM