Share News

ఎన్నికల భద్రతకు కోనసీమ పోలీసుల హైటెక్ అస్త్రం.. ‘K-ORBIT’ యాప్‌తో పర్యవేక్షణ

ABN , Publish Date - Nov 26 , 2026 | 11:00 AM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల భద్రత కోసం పోలీసులు K-ORBIT యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2,064 పోలింగ్ కేంద్రాలు, 104 పోలీసు వాహనాలను డిజిటల్‌గా అనుసంధానించారు.

ఎన్నికల భద్రతకు కోనసీమ పోలీసుల హైటెక్ అస్త్రం.. ‘K-ORBIT’ యాప్‌తో పర్యవేక్షణ
K-ORBIT Police App

అమలాపురం, నవంబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తు నిర్వహణలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఎన్నికల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘K-ORBIT’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని 2,064 పోలింగ్ కేంద్రాలు, 104 పోలీసు వాహనాలకు డిజిటల్‌ను అనుసంధానం చేశారు. ప్రతి 10 సెకన్లకు ఒకసారి పోలీసు వాహనాల కదలికలను లైవ్ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకునే సదుపాయం కల్పించారు.


అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించేందుకు యాప్‌లో SOS అలర్ట్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ పనిని సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేయించేందుకు ‘K-ORBIT’ యాప్ ఉపయోగపడనుంది.


ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 11:07 AM