Share News

ఉత్తరం నుంచి టెక్నాలజీ వరకు..

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:28 PM

తోకలేని పిట్ట పదామడల దూరం ప్రయాణించిందనేది పొడుపు కథ. పూర్వ కాలంలో సమాచార చేరవేతకు దేశ విదేశాల్లో ఉత్తరాలనే ప్రధానంగా ఉపయోగించేవారు.

ఉత్తరం నుంచి టెక్నాలజీ వరకు..
World Post Day

  • పోస్టల్‌ సేవల్లో భారీ మార్పులు.. ప్రజలకు ఆర్థిక, పొదుపు భరోసా

  • బీమాతో ధీమా.. సామాజిక మార్పులను అందిపుచ్చుకున్న పోస్టల్‌ శాఖ

  • నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

తాండూరు(వికారాబాద్): తోకలేని పిట్ట పదామడల దూరం ప్రయాణించిందనేది పొడుపు కథ. పూర్వ కాలంలో సమాచార చేరవేతకు దేశ విదేశాల్లో ఉత్తరాలనే ప్రధానంగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఎలక్ర్టానిక్‌ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది తపాల సేవల్లో అనేక మార్పులొచ్చాయి. ఉత్తరాల బట్వాడ నుంచి స్పీడ్‌పోస్టు, పార్సల్‌ సర్వీసు, ఆర్థిక సేవా కేంద్రాలుగానూ పోస్టాఫీసులు సేవలందిస్తున్నాయి. కాలానికి అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నారు. చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకింగ్‌ సేవలు, జీవిత బీమా స్కీములు వంటి సేవలను సైతం అందిస్తున్నారు. నేడు(శుక్రవారం) ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా పోస్టాఫీసుల సేవలపై ప్రత్యేక కథనం..


కాలానుగుణంగా సేవలు...

ఒకప్పుడు సైకిల్‌పై వచ్చి పోస్టుమ్యాన్‌ ఏదైనా ఉత్తరం ఇస్తే ఆదో అనందంగా ప్రజలు భావించేవారు. దూరాన ఉన్న ఆత్మీయుల ఉత్తరం కోసం వేచి చూసేవారు. ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. తపాలా కార్యాలయ సేవల్లో పెను మార్పులు వచ్చినా పోస్టాఫీసు ప్రాధాన్యం తగ్గలేదు. ఉత్తరాలు, మానియార్డర్లు, పార్సిళ్లతో మొదలైన ప్రయాణం నేడు పొదుపు, బీమా, బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ప్రభుత్వ సేవలు, పార్సిల్‌-లాజిస్టిక్స్‌, ఆధార్‌సెంటర్‌ వంటి అనేక రంగాలకు పోస్టల్‌సేవలు విస్తరించాయి.


గతంలో చేతిలో ఉత్తరం పెట్టిన పోస్టుమ్యాన్‌.. నేడు ప్రజల ఆర్థిక జీవితంలోనూ భాగస్వామిగా మారాడు. దేశంలో 1774లో కలకత్తాలో జనరల్‌ పోస్టాఫీసు ప్రారంభమైంది. 1882లో సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలు తెరిచారు. దీంతో ‘సందేశాల వాహకుడు’గానే కాక ‘పొదుపు భరోసా’గానూ పోస్టల్‌ సేవలు మారాయి. 1884 ఫిబ్రవరి 1న పోస్టల్‌ జీవిత బీమా ప్రారంభించారు.


rrg2.2.jpgప్రస్తుతం ఆరు రకాల బీమా పథకాలను పోస్టల్‌ శాఖ అందిస్తోంది. 1894లో మహిళా ఉద్యోగులకు కూడ పోస్టల్‌ జీవిత బీమా సదుపాయం తెచ్చారు. 1986లో స్పీడ్‌పో్‌స్టలు ప్రారంభమయ్యాయి. 1995 మార్చి 24న రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెచ్చారు. కార్యాలయాల్లో కంప్యూటరీకరణ ప్రవేశపెట్టారు. కోర్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ ఆధారిత సేవలు అందిస్తున్నారు.


చిన్న మొత్తాల పొదుపు పథకాలు

పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా, రికరింగ్‌ డిపాజిట్‌, టైమ్‌ డిపాజిట్‌, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్‌ స్కీమ్‌, పీపీఎస్‌ నేషనల్‌ సర్టిఫికెట్‌, కిసాన్‌ వికాసపత్రం, బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన, బాల జీవన్‌ బీమా వంటి స్కీములు పోస్టాఫీసులు అమలు చేస్తున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు తపాల శాఖ ఆరు బీమా పథకాలను అమలు చేస్తోంది. తక్కవ ప్రీమియం, ఎక్కవ బోనస్‌, పాలసీలు తెచ్చింది. సంతోష్‌, సురక్ష, సువిధ, గ్రామ ప్రియ, సుమంగళ, పిల్లల పాలసీలను అమలు చేస్తున్నారు. ఏ పాలసీ అయినా కనీసం రూ.10వేల నుంచి అత్యధికం రూ.10లక్షల వరకు నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట

దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్‌.. వెయిటింగ్‌ లిస్టు కష్టమే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 01:30 PM