Share News

ఓటు కోసం.. దరఖాస్తుల హోరు

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:55 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం 1,45,715 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఓటు కోసం.. దరఖాస్తుల హోరు
voter list revision

  • కొత్తగా ఓటరు నమోదుకు స్పందన

  • ఉమ్మడి జిల్లాలో 1,45,715 మంది దరఖాస్తులు

  • రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో

  • అత్యధికంగా 26,521 అప్లికేషన్లు

  • 1314 మంది ప్రవాస భారతీయులు దరఖాస్తు

రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం 1,45,715 మంది దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, ఓటరు వివరాల్లో సవరణలకు సంబంధించిన ఫారం-6, ఫారం-6ఎ, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో వీటి వివరాలను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది.


రంగారెడ్డి జిల్లాలో కొత్త ఓటు కోసం ఫారం-6 ద్వారా 74,375 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐలు ఫారం-6ఎ ద్వారా 804 మంది, ఓటు తొలగింపు కోసం ఫారం-7 ద్వారా 2,223 దరఖాస్తులు వచ్చాయి. ఓటర్ల పేర్లు మార్పు, సవరణలు, చిరునామా మార్పు తదితరాలకు సంబంధించిన ఫారం-8 ద్వారా 68,002 దరఖాస్తులు అందాయి. అలాగే మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో కొత్త ఓటు కోసం ఫారం-6 ద్వారా 64,167 మంది దరఖాస్తు చేసుకున్నారు.


అలాగే ఫారం- 6ఏ ద్వారా 561 మంది, ఫారం 7 ద్వారా ఓటు తొలగింపు కోసం 1,749 దరఖాస్తులు రాగా, వివరాల మార్పు కోసం ఫారం 65,414 దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వెల్లడించింది. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు ముగియడంతో వీటికి సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులను నవంబర్‌ 5 లోగా పరిష్కరించి 9వ తేదీన తుది జాబితాలో ప్రచురిస్తారు. సర్‌ తుది జాబితా వెలువడిన తర్వాత కూడా 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత, ఇప్పటి వరకు ఓటరు నమోదు చేసుకోని వారు కూడా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సీఈఓ వెల్లడించారు.


రాజేంద్రనగర్‌లో అత్యధికంగా...

జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఓటు హక్కు కోసం అత్యధికంగా 74,375 మంది దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్‌ జిల్లాలో 64,863, వికారాబాద్‌ జిల్లాలో 6,477 దరఖాస్తులు అందాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే రాజేంద్రనగర్‌లో 26,521 మంది అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా, కుత్భుల్లాపూర్‌లో 17,881, శేరిలింగంపల్లిలో 16520 దరఖాస్తులు అందాయి. అతి తక్కువగా కల్వకుర్తిలో 1363 దరఖాస్తులు వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట

దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్‌.. వెయిటింగ్‌ లిస్టు కష్టమే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 12:55 PM