దసరాకు టీజీఎస్‌ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులు.. 40శాతం అదనపు ఛార్జీలు
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:56 AM
దసరా పండుగ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నగరంలోని బస్టాండ్లలో భారీగా రద్దీ నెలకొంది.
హైదరాబాద్, అక్టోబర్ 9: దసరా పండుగ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నగరంలోని బస్టాండ్లలో భారీగా రద్దీ నెలకొంది. జేబీఎస్, ఎంబీబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దసరాకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నేటి(శుక్రవారం) నుంచి 7 వేల స్పెషల్ బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ నడుపనుంది. ప్రత్యేక బస్సుల్లో 40 శాతం వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు.
కరీంనగర్ జోన్ నుంచి 3,533 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ జోన్ నుంచి 2,155 ప్రత్యేక బస్సులు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి. ఈనెల 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. తిరుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా 25, 26 తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రయాణికుల కోసం షెడ్స్, తాగునీరు, కుర్చీలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 1.5 రెట్లు వరకు సవరించిన టికెట్ ధరలు ఉండనున్నాయి. ఇక, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా అమలులో ఉండనుంది.
ఇవి కూడా చదవండి..
మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా, ఒకరి మృతి
హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్
Read Latest Telangana News And Telugu News