Share News

హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:06 AM

హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లోని రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కేటుగాళ్లు కన్నేసిన ఘటన సంచలనం రేపుతోంది. నకిలీ పత్రాలతో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్రపన్నడం కలకలం రేపింది.

హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్
Nadargul Land Fraud

హైదరాబాద్, అక్టోబర్ 9: నగరంలోని నాదర్‌గుల్‌లోని రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కేటుగాళ్లు కన్నేసిన ఘటన సంచలనం రేపుతోంది. నకిలీ పత్రాలతో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్రపన్నడం కలకలం రేపింది. బాలాపూర్ మండలం నాదర్ గుల్ సర్వే నంబర్ 613లో 373.22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన ముఠా.. నిజాం కాలం నాటి ఫర్మానాకు నకిలీ పత్రాలు సృష్టించింది. స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగితో ఈ ముఠా కుట్రకు తెరతీసింది. ఆర్కైవ్స్ ఉద్యోగికి డబ్బు ఆశచూపిన నిందితులు.. నకిలీ ఫర్మానా తయారీ చేసినట్లు తెలుస్తోంది.


నకిలీ ఫర్మానాతో భూమిపై యాజమాన్య హక్కుల కోసం కేటుగాళ్లు ప్రయత్నం చేసినట్లు సమాచారం. దాదాపు 46 మంది నకిలీ ఫర్మానాతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. రెండు వర్గాలుగా విడిపోయి భూమిని పంచుకునేందుకు పథకం పన్నినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 22న విచారణ సందర్భంగా నకిలీ పత్రాలపై అధికారులకు అనుమానాలు రావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పరిశీలనలో నకిలీ ఫర్మానాగా గుర్తించిన అధికారులు.. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 46 మందిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి..

కొత్త పార్టీలోకి సహచరుడిని ఆహ్వానించిన విజయసాయి రెడ్డి

మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా, ఒకరి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 11:12 AM