కొత్త పార్టీలోకి సహచరుడిని ఆహ్వానించిన విజయసాయి రెడ్డి
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:39 AM
మరికొద్ది రోజుల్లో కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని విజయసాయి దర్శించుకున్నారు.
తిరుమల, అక్టోబర్ 9: మరికొద్ది రోజుల్లో కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు(శుక్రవారం) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని విజయసాయి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త పార్టీ ఆవిర్భావం, తనతో కలిసి పనిచేయబోయే వారి గురించిన వివరాలు వెల్లడించారు. నూతన పార్టీ ప్రారంభించబోతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు.
వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్ నిర్మించాలని మాజీ ఎంపీ కోరారు. ఇక కొత్త పార్టీలోకి తన సహచరుడు ఓవీ రమణను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా కలిసి పని చేశామని తెలిపారు. నూతన పార్టీలో ఇద్దరం కలిసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
చాట్‌జీపీటీతో తప్పుడు ప్రచారం.. రష్యా, ఇరాన్ అకౌంట్స్‌పై ఓపెన్ ఏఐ నిషేధం
సాయికృష్ణ డెత్ కేసు ఛార్జిషీట్‌లో కీలక ఆధారాలు కోర్టు సమర్పించిన సిట్
Read Latest AP News And Telugu News