ఫార్ములా ఆధారిత విధానాన్ని అనుసరించండి
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:57 AM
రొయ్యల మేత ధరల నిర్ణయం విషయంలో నిపుణుల కమిటీ రూపొందించిన ఫార్ములా ఆధారిత విధానాన్ని అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది.
ముడిసరుకుల ధరల ఆధారంగా ప్రతీ 45 రోజులకు మేత ధరను సమీక్షించండి
నిపుణుల కమిటీ ఫార్ములాను పాటించండి
ఆక్వా రైతులు, మేత తయారీదారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రొయ్యల మేత ధరల నిర్ణయం విషయంలో నిపుణుల కమిటీ రూపొందించిన ఫార్ములా ఆధారిత విధానాన్ని అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. నిపుణుల కమిటీ రూపొందించిన ఫార్ములా ప్రకారం ప్రతీ 45 రోజులకు ఒకసారి మేత తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరల ఆధారంగా మేత ధరలను సమీక్షించాలని ధరల పర్యవేక్షణ కమిటీ, మేత తయారీదారులకు స్పష్టం చేసింది. వివరాలను స్టేక్ హోల్డర్లకు తెలియపర్చాలని స్పష్టం చేసింది. వ్యాజ్యాలపై విచారణను మూసివేంది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. వన్నామీ రకం మేతపై టన్నుకు రూ.9వేలు, టైగర్ రకం మేతపై టన్నుకు రూ.12వేలు పెంచుతూ రొయ్యల మేత తయారీదారుల సంఘం, అనుబంధ సంస్థలు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతులు మల్లా తులసీరామ్, వెరవల్లి చంద్రశేఖర్..
మరోవైపు సర్క్యులర్ ధరల అమలు కారణంగా పరిశ్రమ నష్టాల్లోకి వెళ్తుందని మేత తయారీదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. మేత తయారీదారుల తరఫున సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ధరల పర్యవేక్షణ కమిటీ సెప్టెంబరు 28న సమావేశమై తీసుకున్న నిర్ణయాలను మెమో రూపంలో కోర్టు ముందుంచారు. ధరలపై రైతులు, తయారీదారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. అయితే నిఫుణుల కమిటీ సూచించిన ఫార్ములా ఆధారిత పద్ధతిని ఇరువర్గాలు అంగీకరించాయన్నారు. 18శాతం ఫిష్‌మీల్, 60శాతం ప్రొటీన్‌తో కూడిన రొయ్యల మేతను డిస్కౌంట్ ధరలో రూ.117.02గాను, 15శాతం ఫిష్‌మీల్, 65 శాతం ప్రొటీన్ కలిపిన మేతను డిస్కౌంట్ ధరలో రూ111.06గా నిర్ణయించారన్నారు. ఈ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... మేత ధరల నిర్ణయంలో నిపుణుల కమిటీ రూపొందించిన ఫార్ములా ఆధారిత విధానాన్ని అనుసరించాలని ఆదేశిస్తూ వ్యాజ్యాలను పరిష్కరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు