Share News

ఏపీకి అలర్ట్.. అక్టోబర్ 15 నుంచి భారీ వర్షాలు..

ABN , Publish Date - Oct 09 , 2026 | 07:23 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీకి అలర్ట్.. అక్టోబర్ 15 నుంచి భారీ వర్షాలు..
rain alert for ap

అమరావతి, అక్టోబర్ 9: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో ఈ నెల 15 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రజలు, సంబంధిత అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

హైడ్రా బూచిగా అక్రమ వసూళ్లు

జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!

Updated Date - Oct 09 , 2026 | 08:26 AM