Share News

డిసెంబరులో పార్లమెంటు ముట్టడి

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:00 AM

జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడం సిగ్గుచేటని, బీసీలను వంచిస్తే మరో స్వాతంత్ర పోరాటం తప్పదని బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు.

డిసెంబరులో పార్లమెంటు ముట్టడి

  • ఓబీసీ కాలమ్‌ చేర్చకపోతే జనగణనను బహిష్కరిస్తాం

  • జాతీయ సదస్సులో అఖిలపక్ష, బీసీ సంఘాల హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడం సిగ్గుచేటని, బీసీలను వంచిస్తే మరో స్వాతంత్ర పోరాటం తప్పదని బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఓబీసీ జాతీయ స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, ఎంపీ పప్పు యాదవ్‌, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రాజేష్‌ షైనీ, స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్‌ రావు, మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ మనవడు ఇంద్రజిత్‌సింగ్‌, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు అరుణ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ జాతీయ కన్వీనర్‌ సాహు, ఎంఐఎం నేత ఇక్బాల్‌ అన్సారితో పాటు 22 రాష్ట్రాల ఓబీసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నేతలు మాట్లాడుతూ.. జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలనే డిమాండ్‌తో డిసెంబరు 14 15 తేదీలలో వేలాదిమందితో చలో ఢిల్లీ చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓబీసీ కాలం చేర్చకపోతే దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా మూకుమ్మడిగా జనగణనను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీ గణన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 06:00 AM