Share News

‘సర్’పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్

ABN , Publish Date - Oct 09 , 2026 | 09:44 AM

‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.

‘సర్’పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్
ktr demand resignation of cec

హైదరాబాద్, అక్టోబర్9: ‘సర్’ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎలక్షన్ కమిషన్‌పై మండిపడ్డారు.


‘వ్యక్తుల కంటే వ్యవస్థలే గొప్పవి. ఒక్క వ్యక్తిని కాపాడేందుకు ఇంత ఆరాటం ఎందుకు?.. భారత రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదు. భారత పౌరుల ఓటు‌హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఒక్క వ్యక్తి గొప్పవాడా?.. ఎలక్షన్ కమిషన్‌లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహించి.. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వైదొలగాలి. ‘సర్’ ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తునకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ‘సర్’ ప్రక్రియపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి చెందిందంటే జిల్లాగా ఏర్పాటు కావడమే

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 09 , 2026 | 10:56 AM