Home » Resign
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సమర్పించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఎల్‌డీపీలోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెల రోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు.
కల్యాణ్ బెనర్జీ, కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా మధ్య కొద్దికాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికి ముందు టీఎంసీ ఎంపీ కీర్తి అజాద్‌తోనూ మహువా మొయిత్రా గొడవపడ్డారు.
రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకే ధన్‌ఖడ్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ, ఆ విషయాలు తనకు తెలియదని, ఆయన ఎప్పుడూ ప్రభుత్వం పక్షానే ఉండేవారని, అసలు ఏమి జరిగిందనేది ఆయనే చెప్పాలని అన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అఖ్తరుల్ అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యం లేని పదవిని ఇచ్చి నితీష్‌ను తప్పించాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.
బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీయేకు ఇటు లోక్‌సభలోనే కాకుండా అటు రాజ్యసభలోనూ మెజారిటీ సభ్యుల బలం ఉంది. అయినప్పటికీ రాజీనామాకు ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ధన్‌ఖడ్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.
బరువెక్కిన హృదయంతో రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాన్ తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరారు. పార్టీకి బెస్ట్ విషెస్ తెలిపారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ షాక్ ఇచ్చింది. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది.