ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:22 PM
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు.
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు. రాజ్యాంగ ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో పదవులు నిర్వహించరాదు. ఒక పదవిని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బిహార్ శాసనసభ, శాసన మండలికి మార్చి 29 వరకూ విరామం ఇచ్చారు. తిరిగి ఉభయసభలు ఈనెల 30న సమావేశమవుతాయి. అదే రోజు నితీశ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనుండటం దాదాపు ఖారారైందని చెబుతున్నారు. మార్చి 16న బిహార్ నుంచి రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు. మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఏర్పడగా, బిహార్, ఒడిశా, హర్యానాలోని 11 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. తక్కిన స్థానాలకు ఎన్నికలకు ముందే పోటీలేకుండా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జేడీయూ అధ్యక్షుడిగా నితీశ్ ఎన్నిక
కాగా, జేడీయూ అధ్యక్ష పదవికి నితీశ్ కుమార్ ఈనెల 24న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితీశ్ మినహా ఎవరూ ఈ పదవికి నామినేషన్ వేయలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్‌లో జేడీయూ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఆ పదవిని నితీశ్ నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో అద్భుతం: రామ్ లల్లా నుదుట సూర్య కిరణం.. భక్తిపారవశ్యంలో భక్తులు.
'మోదీ, నేను.. పని చేసి చూపించే వ్యక్తులం'.. ప్రధానిని ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు