అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పూరి
ABN , Publish Date - Mar 27 , 2026 | 10:37 AM
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 తగ్గిస్తూ కేంద్రం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
న్యూఢిల్లీ, మార్చి 27: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 తగ్గిస్తూ కేంద్రం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. అలాంటి వేళ మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందన్నారు.
కేవలం నెల రోజుల్లోనే 70 నుంచి 122 డాలర్లకు బ్యారెల్ ఆయిల్ ధర చేరిందని వివరించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నారని మంత్రి హరదీప్ సింగ్ పూరి చెప్పారు. అలాగే ఆగ్నేయాసియాలో 50 శాతం, అమెరికాలో 30 శాతం, ఐరోపాలో 20 శాతం మేర ఇంధన ధరలు పెరిగాయని సోదాహరణగా ఆయన వివరించారు.
వీటి ధరలు తగ్గించడం ద్వారా భారీగా వస్తున్న ఆదాయాన్ని ప్రజల కోసం కేంద్రం వదులుకుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 మేర నష్టాన్ని చమురు సంస్థలు భరిస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించారంటూ ప్రధాని మోదీపై కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
For National News And Telugu News