శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 07:02 AM
శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 27: శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. శ్రీరాముని శోభాయాత్రలో మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ శోభయాత్ర సీతారాంబాగ్‌లో ప్రారంభమై.. సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగియనుంది. శోభాయాత్రలో అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
శోభాయాత్ర నేపథ్యంలో నగరవాసులు తమ ప్రయాణాలకు సంబంధించిన ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అనవసరమైన జాప్యాన్ని నివారించేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ తమకు సహకరించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ, మళ్లింపులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకునేందుకు తమ శాఖకు చెందిన ఎక్స్ ఖాతా @ HYDTPని ఫాలో కావాలని సూచించారు. ప్రయాణంలో ఏదైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే తక్షణ సహాయం కోసం పోలీసుల అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు కాల్ చేయాలన్నారు.
ఇప్పటికే పాత బస్తీలోని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి.. అక్కడ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. యాత్రలో లక్ష మందికిపైగా పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా శోభయాత్రను విజయవంతంగా ఉత్సవ సమితి నిర్వహిస్తోంది. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్ జరగకుండా క్రైమ్ టీమ్‌లతోపాటు షీ టీమ్‌లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఇలా శోభాయాత్ర..

ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
For More TG News And Telugu News