Share News

ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:11 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌కుమార్‌కు సమర్పించారు.

ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా
Nitin Nabin

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి (MLA) సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌కుమార్‌కు సమర్పించారు. ఆయన రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, నితిన్ నబీన్‌ మార్చి 16న బిహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో నితీశ్ తన ఎమ్మెల్సీ పదవికి, నితిన్ నబీన్ ఎమ్మెల్యే పదవికి సోమవారంనాడు రాజీనామా చేశారు.


దీనికి ముందు, నితిన్ నబీన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తన రాజీనామా విషయాన్ని తెలియజేసారు. బంకీపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి ఈరోజు రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి మరణాంతరం బంకీపూర్ నియోజకవర్గం అభివృద్ధికి గత 20 ఏళ్లుగా అంకితమైన పనిచేసినట్టు తెలిపారు. తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పూర్తి చిత్తశుద్ధితో పనిచేసినట్టు చెప్పారు. ఫలితంగా నియోజకవర్గం ప్రజలు వరుసగా ఐదుసార్లు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని చెప్పారు. పార్టీ అప్పగించిన కొత్త బాధ్యతల్లోనూ బంకీపూర్, బిహార్ అభివృద్ధికి పునరకింతమవుతానని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. బీజేపీ కొత్త సీఎం ఎంపికకు కసరత్తు

పెరంబూర్‌లో నామినేషన్ వేసిన విజయ్

Updated Date - Mar 30 , 2026 | 06:11 PM