నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
ABN , Publish Date - Mar 30 , 2026 | 03:42 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సోమవారంనాడు తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కొలతూర్ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly Elections) నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin) సోమవారంనాడు తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కొలతూర్ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. మూడుసార్లు కొలతూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన స్టాలిన్ మరోసారి తన అదృష్టాన్ని ఇక్కడి నుంచే పరీక్షించుకుంటున్నారు.
ఈసారి మరింత భారీ విజయం
డీఎంకే, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ అభ్యర్థిగా తనకు కొలతూర్ నియోజకవర్గం ప్రజలు మరోసారి భారీ విజయాన్ని అందించనున్నారని నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ చెప్పారు. ఈ విషయంలో తాను చాలా గట్టి నమ్మకంతో ఉన్నానని అన్నారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా తమ ప్రచారం చాలా బలంగా ఉంటుందని తెలిపారు.
డీఎంకే ఈ ఎన్నికల్లో 234 నియోజకవర్గాలకు గాను 164 చోట్ల పోటీ చేస్తోంది. భాగస్వామ్య పక్షాలు 70 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 28 స్థానాల్లో, సీపీఎం 5, సీపీఎం (మార్క్సిస్ట్) 5, వీసీకే 8, ఎండీఎంకే 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. డీఎండీకే సహా ఇతర చిన్న పార్టీలు 10 సీట్లలో పోటీలో ఉన్నాయి. 'సూపర్ మేనిఫెస్టో' పేరుతో డీఎంకే మేనిఫెస్టోను ఎంకే స్టాలిన్ ఆదివారంనాడు విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏఐ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి.. అస్సాం కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం