Share News

మహిళలకు ప్రతినెలా 2 వేల నగదు

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:34 AM

ఆదాయపన్ను చెల్లించని కుటుంబాల గృహిణులకు వాషింగ్‌ మిషన్‌, టీవీ, రిఫ్రిజిరేటర్‌, మిక్సీ, మైక్రోవేవ్‌ ఓవెన్‌, ఇండక్షన్‌ స్టవ్‌ తదితర గృహోయోగ ఎలకా్ట్రనిక్‌ వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు రూ.8వేల విలువైన కూపన్‌ను ....

మహిళలకు ప్రతినెలా 2 వేల నగదు

  • తమిళనాడులో డీఎంకే మేనిఫెస్టో విడుదల

చెన్నై, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఆదాయపన్ను చెల్లించని కుటుంబాల గృహిణులకు వాషింగ్‌ మిషన్‌, టీవీ, రిఫ్రిజిరేటర్‌, మిక్సీ, మైక్రోవేవ్‌ ఓవెన్‌, ఇండక్షన్‌ స్టవ్‌ తదితర గృహోయోగ ఎలకా్ట్రనిక్‌ వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు రూ.8వేల విలువైన కూపన్‌ను అందించనున్నట్లు డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఆ కూపన్‌తో ఇంట్లో ఉన్న పాత వస్తువులను మార్చి కొత్త ఎలకా్ట్రనిక్‌ వస్తువులను కొనుక్కునే సదుపాయం కూడా ఉంటుందని చెప్పారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం చెన్నైలో ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో బియ్యం రేషన్‌కార్డులు కలిగిన గృహిణులకు ప్రతినెలా ఇచ్చే రూ.1000ను రూ.2000కు పెంచనున్నామని, ఉచిత విద్యుత్‌ పొందుతున్న 20 లక్షలకు పైగా రైతులకు మీటర్లు లేని కొత్త ఎలక్ర్టిక్‌పం్‌పసెట్లను పంపిణీ చేస్తామని, బడిపిల్లల అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరింపజేస్తామని వివరించారు. వచ్చే ఐదేళ్లలో 11లక్షల వరకు గృహాలు నిర్మిస్తామని, సీఎం ఆరోగ్య బీమా పథకం ఆదాయపరిమితిని రూ.5లక్షలకు, చికిత్స వ్యయాన్ని రూ.10లక్షలకు పెంచుతామని, పుదుమైపెణ్‌, తమిళ్‌పుదల్వన్‌ పథకాల కింద ప్రతినెలా చెల్లించే రూ.1000ను రూ.1500కు పెంచుతామని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు ధర క్వింటాకు రూ.3,500, చెరకు కొనుగోలు ధర టన్నుకు రూ.4500 చెల్లిస్తామని, చెన్నైలో సెమ్మొళి మహానాడును నిర్వహించనున్నామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా వరిపంటకు హెక్టారుకు రూ.25 వేలు, దీర్ఘకాలం పండించే పంటలకు రూ.27వేలు చెల్లిస్తామని, ఉన్నత విద్యనభ్యసించే 35 లక్షల మంది విద్యార్థులకు ఐదేళ్లల్లోగా ఉచితంగా లాప్‌టా్‌పలు పంపిణీ చేస్తామని, ఉన్నతవిద్యను ముగించే 5లక్షల మంది యువకులకు ఉపాధి అవకాశం కలిగించేలా నాన్‌ ముదల్వన్‌ పథకం ద్వారా ప్రతినెలా రూ.1500 స్కాలర్‌షి్‌పతో ఆరు నెలల శిక్షణ అందిస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లో వైఫై సదుపాయంతో కూడిన డిజిటల్‌ ట్రైనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వితంతువులు, 50 ఏళ్ల వయసు దాటిన అవివాహిత మహిళలకు నెలకు రూ.2వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

Updated Date - Mar 30 , 2026 | 04:34 AM