రెండు విడతల్లో ఏపీ, తెలంగాణలో జనగణన.. వివరాలు వెల్లడించిన సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:57 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు విడతల్లో జనగణన జరుగుతుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు విడతల్లో జనగణన జరుగుతుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఇస్తామన్నారు. ఇక, తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల సర్వే జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10 తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఉంటుందని అన్నారు. జనాభా లెక్కల వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
సోమవారం సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ మీడియాతో మాట్లాడుతూ.. ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో ప్రజలు సొంతంగా జనాభా లెక్కల వెబ్‌సైట్‌లో ఇళ్ల సర్వే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇళ్ల సర్వేలో ఇంటి పరిస్థితి, ఇంటి వసతులు, వస్తువులు, ఇల్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినదా వంటి 34 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తొలివిడతలో గృహాల లెక్కింపు ఉంటుంది. ప్రతీ ఇంటి పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తులు తదితర వివరాలు సేకరిస్తాం. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 30 రోజులపాటు హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. హౌస్ లిస్టింగ్‌కు నెలరోజుల ముందు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు 15 రోజులపాటు అవకాశం ఉంటుంది’..
‘సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితుల వివరాలతో పాటు వలసలు, సంతానోత్పత్తి స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాం. రెండో దశలో కులగణన వివరాలు సేకరిస్తాం. https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. 11,718 కోట్ల రూపాయలతో జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. 16 భాషల్లో మొబైల్ యాప్ ద్వారానే జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఎన్యుమరేటర్స్ సొంత మొబైల్స్ ద్వారానే జనాభా లెక్కలను సేకరిస్తారు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ ఫొటోలో పెన్సిళ్లను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు సూపర్ పవర్ ఉన్నట్టే..
అప్‌డేట్ కావడంలో పార్టీ విఫలమైంది: ఏవోబీ కమిటీ సభ్యుడు నారాయణరావు