Share News

అప్‌డేట్ కావడంలో పార్టీ విఫలమైంది: ఏవోబీ కమిటీ సభ్యుడు నారాయణరావు

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:19 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల వరుస లొంగుబాట్లు చర్చనీయాంశంగా మారింది. తాజాగా మావోయిస్టు కీలక నేత ఏపీ పోలీసుల ముందు లొంగిపోయారు.

అప్‌డేట్ కావడంలో పార్టీ విఫలమైంది: ఏవోబీ కమిటీ సభ్యుడు నారాయణరావు
Maoist Surrender Andhra Prades

అమరావతి, మార్చి 30: ఏవొబీ (ఆంధ్రా-ఒడిశా బార్డర్) రాష్ట్ర కమిటీలో కీలక నేతగా ఉన్న చెల్లూరు నారాయణరావు అలియాస్ సొమన్న తన అనుచరులతో కలిసి సోమవారం ఏపీ పోలీసుల ముందు లొంగిపోయారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అడవి బాట వీడి.. అభివృద్ధి పథంలోకి నడవాలని నిర్ణయించుకున్నట్లు నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఉదమ్యం పరిస్థితి, పార్టీ వైఫల్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.


చెల్లూరు నారాయణరావు మాట్లాడుతూ..‘నేను మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లినప్పటికీ.. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలను చేరుకుంటున్నాయి. గతంలో ప్రణాళిక ప్రకారం ఉద్యమం ముందుకు వెళ్లేది. మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడంలో విఫలమవుతోంది. ఇటీవల పార్టీ తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేవు. దేశవ్యాప్తంగా ఉన్న నక్సల్స్ ఉద్యమం ఈరోజు కనుమరుగైంది. ఉద్యమం దెబ్బతినడానికి సరైన సమాచారం, అప్‌డేట్‌ కాకపోవడమే కారణం. మా చేతుల్లో చాలా మంది చనిపోయారు.. దానికి ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నా. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అడవి బాట వీడి అభివృద్ధి పథంలో నడవాలని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి...

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

ఆ ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయండి: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 01:52 PM