మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్
ABN , Publish Date - Mar 30 , 2026 | 09:39 AM
హైదరాబాద్‌లో 40 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న రైల్వేశాఖ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, మార్చి 30: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. మోకిలలో డ్రగ్స్ విక్రయిస్తున్న డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 40 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి రైల్వేశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తి.. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుండగా రైల్వే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో గూగుల్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పాటూ మరో వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు కార్లను సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలి: విద్యాసాగర్
కరువు మండలాల విద్యార్థులకు డ్రై రేషన్
Read Latest Telangana News And Telugu News