Share News

ఐజేయూ అధ్యక్షుడిగా బల్విందర్‌ సింగ్‌ జమ్మూ

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:25 AM

ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) 11వ జాతీయ ప్లీనరీ ముగింపు సందర్భంగా ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఐజేయూ అధ్యక్షుడిగా బల్విందర్‌ సింగ్‌ జమ్మూ

  • సెక్రటరీ జనరల్‌గా డి.సోమసుందర్‌ ఎన్నిక

విజయవాడ అర్బన్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) 11వ జాతీయ ప్లీనరీ ముగింపు సందర్భంగా ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐజేయూ అధ్యక్షుడిగా బల్విందర్‌ సింగ్‌ జమ్మూ (పంజాబ్‌), సెక్రటరీ జనరల్‌గా డి.సోమసుందర్‌ (ఆంధ్రప్రదేశ్‌)లు గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిద్దరూ ప్లీనరీ వేదికపై ఆదివారం బాధ్యతలు చేపట్టారు. మిగిలిన ఆఫీస్‌ బేరర్‌ పోస్టులకు, కార్యవర్గ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఏపీ, తెలంగాణ నుంచి కూన అజయ్‌బాబు (ఆంధ్రప్రదేశ్‌), ఈఎన్‌ రాజు (ఆంధ్రప్రదేశ్‌), వై.నరేందర్‌ రెడ్డి(తెలంగాణ), కె.సత్యనారాయణ (తెలంగాణ), కె.అజిత(తెలంగాణ), నగునూరి శేఖర్‌(తెలంగాణ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుంది

Updated Date - Mar 30 , 2026 | 06:27 AM