Share News

మిల్లర్ల సంఘం రాష్ట్ర నాయకత్వం మార్పుపై కమిటీ!

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:28 AM

రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌లో వైసీపీ వాసనలు లేకుండా నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి.

మిల్లర్ల సంఘం రాష్ట్ర నాయకత్వం మార్పుపై కమిటీ!

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌లో వైసీపీ వాసనలు లేకుండా నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. ఈ వ్యవహారంపై కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ బాబు(టీడీపీ), కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ(జనసేన), మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు(టీడీపీ), అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(బీజేపీ)తో ‘కూటమి కమిటీ’ ఏర్పాటైనట్లు సమాచారం. ప్రస్తుతం కాకినాడ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా వల్లూరి సూర్యప్రకాశరావు(సూరిబాబు) వ్యవహరిస్తున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. ఆయన్ను వైసీపీకి చెందిన ద్వారంపూడి వర్గం వ్యతిరేకిస్తోంది. దీనిపై ‘ద్వారంపూడి పెత్తనానికి చెక్‌!’ అనే శీర్షికతో 28న ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనం కలకలం రేపింది. దీంతో ఈ విషయాన్ని కూటమి పార్టీలు సీరియ్‌సగా తీసుకున్నాయి.

Updated Date - Mar 30 , 2026 | 06:29 AM