Share News

ఆ ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయండి: కవిత

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:11 AM

జీవో 317ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు.

ఆ ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయండి: కవిత
Kavitha Letter

హైదరాబాద్, మార్చి 30: జీవో నం.317 బాధితులకు వన్‌టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నం.317 వల్ల వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. జీవో 317ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై అప్పటి సీఎం కే.చంద్రశేఖర్ రావుకు(కేసీఆర్‌) లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ.. జీవో 317ను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని కాంగ్రెస్ స్పష్టంగా పొందుపరిచినట్లు కవిత పేర్కొన్నారు.


ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు గతంలో ఈ బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని కవిత లేఖలో గుర్తు చేశారు. జీవో 317 వల్ల ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులు, ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. స్థానికతను గుర్తించే నిబంధనల్లో సమూల మార్పులు చేసి.. ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని కవిత లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కరువు మండలాల విద్యార్థులకు డ్రై రేషన్‌

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 11:48 AM