Share News

నరసరావుపేట ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరి మృతి

ABN , Publish Date - Mar 30 , 2026 | 09:53 AM

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైద్యుడి కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ గోపి చనిపోయారు.

నరసరావుపేట ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరి మృతి
Doctor Family Suicide

పల్నాడు జిల్లా, మార్చి 30: నరసరావుపేటలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైద్యుడు గోపి ఈరోజు(సోమవారం) చనిపోయారు. నరసరావుపేటలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. నాదెండ్ల మండలానికి చెందిన డాక్టర్ కుంభ గోపి కుటుంబం నిన్న(ఆదివారం) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి మౌనిక, భార్య శంకర కుమారి మృతి చెందగా.. డాక్టర్ గోపి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.


గోపి కుటుంబం భోపాల్‌లో నివాసం ఉంటోంది. భోపాల్ ఎయిమ్స్‌లో గోపి డాక్టర్‌గా, అతడి భార్య శంకర కుమారి నర్స్‌గా పనిచేస్తున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె మౌనిక ఉంది. చిన్నారి మౌనికకు పుట్టినప్పటి నుంచి డౌన్ సిండ్రోమ్‌ అనే అనారోగ్య సమస్య ఉండటంతో తండ్రి గోపి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ కారణంగా గోపి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్రం చేసినట్లు తెలుస్తోంది. గోపి కుటుంబం శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చింది. ఓ లాడ్జి‌లో రూమ్ తీసుకుని చిన్నారితో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మత్తు ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలి: విద్యాసాగర్‌

కరువు మండలాల విద్యార్థులకు డ్రై రేషన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 10:14 AM