Share News

ఈ ఫొటోలో పెన్సిళ్లను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు సూపర్ పవర్ ఉన్నట్టే..

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:32 PM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.

ఈ ఫొటోలో పెన్సిళ్లను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు సూపర్ పవర్ ఉన్నట్టే..
Optical Illusion

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ టెస్ట్. ఆ ఫొటోలో కొన్ని జంతువులు పుస్తకాలు చదువుతున్నాయి. ఆ ఫొటోలో చెట్లు, ఆకులు, పుస్తకాలు కనబడుతున్నాయి. అయితే అక్కడ కొన్ని పెన్సిళ్లు కూడా ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తేనే ఆ పెన్సిళ్లు మీకు కనబడతాయి. ఆ పెన్సిళ్లను కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. ఆ పెన్సిళ్లను 10 సెకెన్ల వ్యవధిలో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 10 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో పెన్సిళ్లు ఎక్కడున్నాయో మీకు తెలుస్తుంది.

puzzle4.jpg


ఇవి కూడా చదవండి..

బిట్‌కాయిన్‌ దిగి వచ్చింది.. 67 వేల డాలర్ల దిగువకు..


ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..

Updated Date - Mar 30 , 2026 | 01:32 PM