Share News

ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:43 AM

ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు.

ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది: డొనాల్డ్ ట్రంప్
Donald Trump Iran war

ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. తాజాగా ఆంగ్ల పత్రిక 'ఫైనాన్సియల్ టైమ్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడారు (Donald Trump Iran war).


'ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద విషయం కాదు. మా ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఆ ద్వీపాన్ని మేం స్వాధీనం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. కొన్నాళ్లు మా ఆధీనంలో ఉంచుకోవచ్చు. ఇరాన్ వద్ద ఆత్మరక్షణ కోసం ఇంకేమీ మిగలలేదని అనుకోవడం లేదు. కానీ, ఒక్కసారి మేం దాడి మొదలుపెడితే.. ఖర్గ్ ద్వీపాన్ని చాలా సులభంగా స్వాధీనం చేసుకుంటాం. ఇరాన్‌పై భూతల దాడులు చిట్టచివరి ఆప్షన్ మాత్రమే' అని ట్రంప్ పేర్కొన్నారు (Kharg Island plan).


ఇక, హోర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై కూడా ట్రంప్ స్పందించారు (US Iran conflict 2026). 'అదే నిజమైతే అమెరికా రెండు నిమిషాలలో ఆ సమస్యను పరిష్కరిస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఇరాన్‌పై తిరగబడతాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నా' అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

బిట్‌కాయిన్‌ దిగి వచ్చింది.. 67 వేల డాలర్ల దిగువకు..


ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..

Updated Date - Mar 30 , 2026 | 10:43 AM