Share News

పొన్నగంటి ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు.

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:10 AM

పొన్నగంటి కూర.. దీన్నే కొన్ని ప్రాంతాల్లో చెన్నగంటి కూర అని కూడా అంటారు. పొన్నగంటి కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు.. ఇది ఒక అద్భుతమైన ఔషధ గని. ‘పొన్నగంటి కూర తింటే కంటికి వెలుగు’ అని సామెత కూడా ఉంది. దీని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పొన్నగంటి ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు.
Ponnaganti Leaf Benefits

ఇంటర్నెట్ డెస్క్: పొన్నగంటి కూర.. దీన్నే కొన్ని ప్రాంతాల్లో చెన్నగంటి కూర అని కూడా అంటారు. పొన్నగంటి కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ఔషధ గని. ‘పొన్నగంటి కూర తింటే కంటికి వెలుగు’ అని సామెత ఉంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. పొన్నగంటి కూర తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ ఆకుకూరలో ఉండే పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. ఇలా ఒక్కటి ఏంటి.. చాలా రకాల పోషకాలు ఉన్నాయి. పొన్నగంటి కూర తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. పొన్నగంటి కూర ఏడాది పొడవునా లభిస్తుంది. మరి పొన్నగంటి కూర తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.


కంటి చూపు మెరుగుదల:

పొన్నగంటి ఆకులో విటమిన్ -ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రేచీకటిని నివారించడమే కాకుండా, కంటి చూపును స్పష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేసేవారు ఈ ఆకు కూర తినడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

చర్మ సౌందర్యం:

పొన్నగంటి ఆకును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. చర్మంపై వచ్చే అలర్జీలు, మచ్చలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

వేడిని తగ్గిస్తుంది:

ఈ ఆకు కూర శరీరానికి చలవ చేస్తుంది. ఎండాకాలంలో లేదా అధిక వేడి వల్ల వచ్చే నోటి పూత, మూత్ర విసర్జనలో మంట వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం.

ఎముకలకు బలం:

ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. పొన్నగంటి కూర తింటే బరువు తగ్గొచ్చు. ఇందులో ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ కూరతో అన్నం కొద్దిగా తిన్నా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది:

ఈ ఆకుకూర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తాయి. దీనివల్ల త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకుకూరతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

Updated Date - Mar 30 , 2026 | 10:21 AM