Share News

బిట్‌కాయిన్‌ దిగి వచ్చింది.. 67 వేల డాలర్ల దిగువకు..

ABN , Publish Date - Mar 30 , 2026 | 08:50 AM

అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్‌లో డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 66,500 డాలర్లకు దిగి వచ్చింది. మార్చి 27వ తేదీన 65,720 డాలర్ల కనిష్ఠానికి కూడా పడిపోయింది. గత వారం రోజుల్లో బిట్‌కాయిన్ దాదాపు 4 శాతం మేర విలువను కోల్పోయింది.

బిట్‌కాయిన్‌ దిగి వచ్చింది.. 67 వేల డాలర్ల దిగువకు..
Bitcoin price

అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్‌లో డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 66,500 డాలర్లకు దిగి వచ్చింది. మార్చి 27వ తేదీన 65,720 డాలర్ల కనిష్ఠానికి కూడా పడిపోయింది. గత వారం రోజుల్లో బిట్‌కాయిన్ దాదాపు 4 శాతం మేర విలువను కోల్పోయింది. సమీప కాలంలో బిట్‌కాయిన్ ధర మరింత దిగి రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు (Bitcoin price today).


బిట్‌కాయిన్ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అన్ని రంగాలతో పాటూ డిజిటల్ క్రిప్టో కరెన్సీపైనా ప్రభావం చూపిస్తున్నాయి. సురక్షిత పెట్టుబడుల వైపు మదుపర్లు దృష్టి సారించడం ఒక కారణం కావచ్చు. అలాగే మార్చి 27వ తేదీన సుమారు 14 బిలియన్ డాలర్ల విలువైన ఆప్షన్స్ ఎక్స్‌పైరీ. ఈ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయడం వల్ల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడి బిట్‌కాయిన్ పతనమైంది (BTC falls $66K).


మూడోది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని వార్తలు రావడం (Bitcoin analysis 2026). ఈ నేపథ్యంలో క్రిప్టో మార్కెట్ వరుస నష్టాలను చవిచూస్తోంది. రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్ చలనం ఏవైపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న 66 వేల డాలర్ల వద్ద నిలబడగలిగితే.. తిరిగి పుంజుకుని 68 వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం 60 వేల డాలర్లకు పడిపోయే ప్రమాదం ఉంది.


ఈ వార్తలూ చదవండి:

గర్భధారణపై మైక్రోగ్రావిటీ ప్రభావం.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..

జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు.. వీడియో వైరల్

Updated Date - Mar 30 , 2026 | 08:59 AM