ఢిల్లీ పోలీసులకు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్..
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:10 PM
బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్‌కు చెందిన షబ్బీర్ అహ్మద్ లోన్ లష్కరే తోయిబా ఆపరేటివ్.
బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్‌కు చెందిన షబ్బీర్ అహ్మద్ లోన్ లష్కరే తోయిబా ఆపరేటివ్. పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు లష్కరే తరపున భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అతడిని తాజాగా ఢిల్లీకి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు (Shabir Ahmed Lone arrest).
షబ్బీర్ బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేస్తుంటాడని అధికారులు తెలిపారు. భారత్‌లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న బంగ్లా జాతీయులను నియమించుకుని దాడులకు కుట్ర పన్నుతుంటాడని, పాక్ పేరు బయటకు రాకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ అని అధికారులు తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో 2007లోనే షబ్బీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు అతడి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 2018 వరకు తీహార్ జైల్లో ఉన్నాడు (Lashkar-e-Taiba terrorist).
2018లో బెయిల్ లభించడంతో బయటకు వచ్చి బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్‌లో తన లష్కరే నెట్‌వర్క్‌ను షబ్బీర్ పునర్నిర్మించాడు (Delhi Police operation). మళ్లీ భారత్‌పై దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. షబ్బీర్‌కు 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌తో కూడా సంబంధాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. షబ్బీర్‌పై నిఘా పెట్టి తాజాగా అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
బిట్‌కాయిన్ దిగి వచ్చింది.. 67 వేల డాలర్ల దిగువకు..
ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..