Share News

మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా, ఒకరి మృతి

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:09 AM

కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నందిగామ మండలం దండిగానపూడి వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా, ఒకరి మృతి
Road Accident

కృష్ణాజిల్లా, అక్టోబర్ 9: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నందిగామ మండలం దండిగానపూడి వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. మృతుడు తుమ్మలపల్లికి చెందిన కుచర్లపాటి సామియేలుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.


మద్యం మత్తులో కారును వేగంగా నడపడం వల్లే అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన సునీల్, సురేష్‌లను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారు డోర్ తెరుచుకోవడంతో ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సామియేలు మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


ఇవి కూడా చదవండి..

సాయికృష్ణ డెత్ కేసు ఛార్జిషీట్‌లో కీలక ఆధారాలు కోర్టు సమర్పించిన సిట్

కొత్త పార్టీలోకి సహచరుడిని ఆహ్వానించిన విజయసాయి రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 10:10 AM