Share News

రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:56 AM

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలు కానున్నాయి.

రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations,

  • ప్రారంభమైన బొడ్డెమ్మ

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలు కానున్నాయి. వేడుకలకు ఆయా ప్రాంతాల ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా బోయినపల్లి కంటోన్మెంట్‌ ప్లే గ్రౌండ్‌లో కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని పండుగ విశ్వవ్యాప్తంగా చాటతోందని కంటోన్మెంట్‌ జంపన అన్నారు.


city7.2.jpgఅలాగే బోయినపల్లి జయనగర్‌ కాలనీ చౌరస్తాలో వేడుకలు, దాండియా నిర్వహించడానికి కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఏడుగుడుల దేవాలయం, తాడ్‌బండ్‌ దేవాలయం, సీతారాంపురం శివాలయంలలో ఏర్పాట్లు గావిస్తున్నారు. తెలంగాణ బతుకుల్లో వెలుగులు, నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని బతుకమ్మ పండగను సంప్రదాయ బద్డంగా జరుపుకోవాలని జక్కుల మహేశ్వర్‌ రెడ్డిలు కోరారు.


city7.jpgపూలనే దేవుళ్లుగా..

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోంది. ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ బతుకమ్మ జరుపుకుంటాం.

  • యోగిత


తెలంగాణ ఆస్థిత్వ చిహ్నం..

బతుకమ్మ అంటే జీవితాన్ని ప్రసాదించు తల్లి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి, సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ పండుగలో ప్రకృతిలో సహజంగా లభించే రంగురంగుల పూలను ఉపయోగిస్తారు. తెలంగాణ అస్థిత్వ చిహ్నం బతుకమ్మ పండుగను వెయ్యేళ్ల నుంచే జరుపుకుంటున్నారు.

  • అజంతా


ఈ వార్తలు కూడా చదవండి:

పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట

దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్‌.. వెయిటింగ్‌ లిస్టు కష్టమే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 11:01 AM