నెట్స్‌లో వైభవ్ వీర విధ్వంసం.. రెండో టీ20లో చోటు దక్కుతుందా?
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:07 AM
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం రాంచీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో రాంచీలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో యువ బ్యాటర్ వైభవ్ బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ షాట్లు ఆడాడు. దీంతో రెండో టీ20లో అయినా వైభవ్‌కు అవకాశం ఇస్తారా? అనే చర్చ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం రాంచీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సీనియర్ల కారణంగా జట్టులో అవకాశం రాకపోవడంతో.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో రెండో టీ20కి ముందు వైభవ్ నెట్స్‌లో విధ్వంసం సృష్టించాడు. రాంచీలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ షాట్లు ఆడాడు. దీంతో రెండో టీ20లో అయినా వైభవ్‌కు అవకాశం ఇస్తారా? అనే చర్చ మొదలైంది.
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చేశారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తమదైన శైలిలో దూకుడుగా బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇషాన్ భారీ షాట్లు ఆడగా.. పక్కనే ఉన్న నెట్స్‌లో వైభవ్ సైతం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతడి బ్యాటింగ్‌ను చూసేందుకు పోలీసులు, ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు.
సొంతగడ్డపై ఇషాన్‌కు ప్రత్యేకం
మరోవైపు జార్ఖండ్‌కు చెందిన ఇషాన్ కిషన్‌కు రాంచీ సొంత మైదానంతో సమానం. ఈ స్టేడియంలో ఆడిన అనుభవం ఉండటంతో నెట్స్‌లో అతడు ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. రవి బిష్ణోయ్, నమన్ ధీర్, అభిషేక్ శర్మ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. సంజు శాంసన్‌తో కలిసి బ్యాటింగ్ చేసిన ఇషాన్.. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు బాదాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హరియాణాతో జరిగిన ఫైనల్లో కేవలం 49 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.
ఇవీ చదవండి:
సినిమాలు పక్కనపెట్టి సైన్యంలోకి.. కార్గిల్ వీరుడిగా నానా పటేకర్
ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్.. తర్వాత నిరసన’ ఫార్ములా!