న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భువీ ఎంపిక.. అసలు కారణమిదే!
ABN , Publish Date - Oct 08 , 2026 | 09:16 PM
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్ ఎంపికపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. అంతర్జాతీయ అనుభవం, గత రెండు ఐపీఎల్ సీజన్లలో ప్రదర్శనే ఎంపికకు కారణమని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కడంపై టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. అతడి అనుభవమే జట్టులో ఎంపికయ్యేందుకు కారణమైందని చెప్పుకొచ్చాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత భువీకి టీ20 జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ తరఫున తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు భువీ.
'ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా లేకపోవడంతో యువ బౌలర్లకు ఎక్కువగా అవకాశాలు లభించాయి. వారు బాగానే రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవాన్ని భర్తీ చేయలేం. ఏదో ఒక దశలో అనుభవజ్ఞుల అవసరం ఉండనే ఉంటుంది. భువనేశ్వర్ గత రెండు ఐపీఎల్ సీజన్లలో అదిరే ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ పరిస్థితుల్లో అతడి అనుభవం ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావించారు. మాకు ఆ అనుభవం అవసరం' అని కోటక్ అన్నాడు.
కాగా.. న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది భారత్. ఈ నెల 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 5 వన్డేలు, 2 టెస్టులు జరగనున్నాయి. ప్రస్తుతం భారత్ వెస్టిండీస్‌తో 5 టీ20ల సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన టీమ్ఇండియా.. రెండో టీ20లో రేపు(శుక్రవారం) రాంచీలో తలపడనుంది.
ఇక భువీ విషయానికొస్తే.. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించాడతడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో 31 మ్యాచ్‌లు ఆడిన భువీ.. 45 వికెట్లు పడగొట్టాడు. 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసి.. 17.89 సగటు, 7.95 ఎకానమీతో ఆకట్టుకున్నాడు. ఆ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. భువీ రాణించిన రెండు సీజన్లలోనూ ఆర్సీబీ విజేతగా నిలవడం విశేషం.
ఇవీ చదవండి:
సినిమాలు పక్కనపెట్టి సైన్యంలోకి.. కార్గిల్ వీరుడిగా నానా పటేకర్
ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్.. తర్వాత నిరసన’ ఫార్ములా!
ఓటు చోరీ ఆరోపణలపై మాజీ జడ్జిల ఫైర్.. ఈసీకి మద్దతుగా 42 మంది బహిరంగ లేఖ