Share News

పారా ఆసియాడ్‌కు బయల్దేరిన భారత బృందం

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:21 AM

జపాన్‌లో జరిగే పారా ఆసియా క్రీడలకు భారత బృందం గురువారం బయల్దేరింది. అట్టహాసంగా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో భారత జెర్సీని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఆవిష్కరించారు.

పారా ఆసియాడ్‌కు బయల్దేరిన భారత బృందం

న్యూఢిల్లీ: జపాన్‌లో జరిగే పారా ఆసియా క్రీడలకు భారత బృందం గురువారం బయల్దేరింది. అట్టహాసంగా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో భారత జెర్సీని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఆవిష్కరించారు. ‘మీరు జీవిత ప్రయాణాన్ని ఈపాటికే గెలిచారు. ఇక, విజయ గీతికతో పతకాలు కొల్లగొట్టాల్సిన సమయం’ అని మాండవీయ అన్నారు. కఠిన ఎంపిక ప్రక్రియ ద్వారా 130 మంది కోటాను 60 మందికి కుదించారు. అయితే, భారత్‌ 95 పతకాలు గెలిచే అవకాశం ఉందని హెడ్‌ కోచ్‌ సత్యనారాయణ చెప్పాడు. పారా ఆసియా క్రీడలు జపాన్‌లోని అయిచి-నగోయలో ఈ నెల 18 నుంచి 24 వరకు జరగనున్నాయి. మార్చ్‌ పాస్ట్‌లో షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. 60 మందే వెళ్తున్నా.. మూ డంకెల సంఖ్యలో పతకాలు సాధిస్తామని భగత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Updated Date - Oct 09 , 2026 | 01:22 AM