నెల్లూరులో ప్రభుత్వ హైస్కూల్ ఆధునికీకరణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:22 AM
నెల్లూరు జిల్లా ఏసీ నగర్‌లోని మల్లెల సంజీవయ్య ప్రభుత్వ హైస్కూల్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా హైస్కూల్‌ను రూ.9.69 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించేందుకు జిగ్మా కంపెనీ ముందుకొచ్చింది.
నెల్లూరు, అక్టోబర్ 9: ఏసీ నగర్‌లోని మల్లెల సంజీవయ్య ప్రభుత్వ హైస్కూల్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా హైస్కూల్‌ను రూ.9.69 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించేందుకు జిగ్మా కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఈరోజు(శుక్రవారం) ఆధునికీకరణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. కుమార్తె షరణితో కలిసి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నగరంలో పాలకుల నిర్వాకం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని విమర్శించారు.
సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో అన్ని పనులను తిరిగి ప్రారంభించామని మంత్రి తెలిపారు. 2028 చివరికల్లా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన ఆలోచన అని అన్నారు. విద్యతో సమాజంలో మార్పు సాధించవచ్చన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
కొత్త పార్టీలోకి సహచరుడిని ఆహ్వానించిన విజయసాయి రెడ్డి
మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా, ఒకరి మృతి
Read Latest AP News And Telugu News