ప్రజల తీర్పును గౌరవించే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:15 AM
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యవహార శైలిలో ఓ వింత, విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం... లేకపోతే రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారమా? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.
హైదరాబాద్, అక్టోబర్ 09: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యవహార శైలిలో ఓ వింత, విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం... లేకపోతే రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారమా? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. ప్రజల తీర్పును గౌరవించే అలవాటు కాంగ్రెస్ పార్టీ లేదని వ్యంగ్యంగా అన్నారు. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయడమే ఆ పార్టీకి అలవాటు అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలు అవినీతి మాయమయ్యాయని ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం, కాగ్, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తమ రాజకీయ ప్రయోజనాలు అనుగుణంగా వ్యవహరించ లేదనే కారణంతో ఆయా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. శుక్రవారం ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్
‘సర్’పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News