Share News

రైతులకు కరెంట్ ఇవ్వకుంటే నిరసన ఢిల్లీకి చేరుతుంది: కొత్త ప్రభాకర్ రెడ్డి

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:17 PM

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోడు వినిపించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం గ్రామాలలోకి వచ్చారని.. అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

రైతులకు కరెంట్ ఇవ్వకుంటే నిరసన ఢిల్లీకి చేరుతుంది: కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha Prabhakar Reddy

సిద్దిపేట, అక్టోబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోడు వినిపించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు(శుక్రవారం) అక్బర్‌పేట భూంపల్లి మండలం సిద్దిపేట - రామాయంపేట హైవేపై రైతులకు సరిపడా కరెంట్ సరఫరా చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ నేతలు చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఓట్ల కోసం గ్రామాలలోకి వచ్చారని.. అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు వేసిన వేల ఎకరాల పంట ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టన్నా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కూడవెల్లి వాగులో తాము నింపిన నీళ్లు ఇంకా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 గంటల పాటు కరెంట్ ఇవ్వకుంటే ఇక్కడ ప్రారంభమైన నిరసన ఢిల్లీకి చేరుకుంటుందని హెచ్చరించారు. నీళ్లు, కరెంట్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను కూడా సాధించుకున్నామని గుర్తుచేశారు. గతంలో బీజేపీ హయాంలో దొడ్డు వడ్లు కొనుగోలు చేయమని చెబితే కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ ముందు నిరసన తెలిపామన్నారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తే వారి కోసం తన పదవికి కూడా రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్

దసరాకు టీజీఎస్‌ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులు.. 40శాతం అదనపు ఛార్జీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 12:20 PM