‘ఆధార్’ సవరింపులు ఇక ఈజీ
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:43 AM
ఆధార్ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామాల్లో స్పెల్లింగ్, భాషాపరమైన తప్పులకు భారత విశిష్ట ప్రాధికార సంస్ధ (యుఐడీఏఐ- ఉడాయ్) పరిష్కారాన్ని తీసుకువచ్చింది.
పలు మార్పులు తీసుకువచ్చిన ఉడాయ్
సంబంధిత డాక్యుమెంట్లతో రు.75 చెల్లిస్తే చాలు
పేరు పూర్తిగా మార్చుకోవడానికి గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి
వరంగల్: ఆధార్ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామాల్లో స్పెల్లింగ్, భాషాపరమైన తప్పులకు భారత విశిష్ట ప్రాధికార సంస్ధ (యుఐడీఏఐ- ఉడాయ్) పరిష్కారాన్ని తీసుకువచ్చింది. పేరు మార్చుకోవడంతో పాటుగా తప్పులను సవరించుకునేందుకు ఉడాయ్ నూతన నిబంధనలను అందుబాటులోకి తీసు కువచ్చింది. ఆధార్‌లో పేరు, ఇంటి పేరు, చిరునామాలోని స్పెల్లిం గ్‌ల తప్పులను సరిచేయడం ఇపుడు చాలా సింపుల్. అలాగే వివాహం, విడాకుల అనంతరం మహిళలు తమ ఇంటి పేరును సులువుగా మార్చుకునే వెసులు బాటును కూడా ఉడాయ్ కల్పించింది.
అంతేకాదు ఆధార్‌లో కొంతమంది అలియాస్ పేరుతో రెండు పేర్లు ఉన్న వారు కూడా ఇప్పుడు తాము శాశ్వతంగా వినియోగించుకునే ఒక పేరునే ఆధార్‌లో పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, ఇంటిపేరు, చిరునామాలో ఎలాంటి తప్పులు ఉన్నా... ఉడాయ్ జారీ చేసిన నిర్దేశిత డాక్యుమెంట్‌లతో ఆధార్ కేంద్రానికి వెళ్లి రు.75 చెల్లించి సింపులుగా మార్చుకోవచ్చు.. అయితే పేరు పూర్తిగా మార్చుకోవాలంటే మాత్రం అధికా రిక గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి.
చిన్నపాటి సవరణలు
పేరు, ఇంటిపేరు, చిరునామాలోని చిన్నపాటి సవరణలను మైనర్ కరెక్షన్ కేటగిరిలో సరిచేసుకోవచ్చు. పొట్టిగా ఉన్న పేర్లను కుదించడం, పూర్తిగా మార్చడం, ఇంటి పేరు తొలగించడం, జోడించడం, పేర్ల క్రమాన్ని మార్చుకోవడం, ఉచ్చారణ పరంగా ఒకేలా ఉండే అక్షర దోషాలను ఈ కేటగిరిలో సరిచేసు కోవచ్చు. అయితే వీటికి సంబంధిత ఏదైనా డాక్యుమెంట్ సమర్పిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఆర్‌కె ప్రసాద్‌ను రాయల కృష్ణప్రసా ద్‌గా మార్చుకోవచ్చు. ఇందుకు ఏదైనా గుర్తింపు పత్రం ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు.
వివాహం/ విడాకుల సందర్భాల్లో..
మహిళలకు సంబంధించిన ఇంటిపేరు మా ర్పులు వివాహం, విడాకుల సందర్భాల్లో అవస రం పడుతుంది. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రంతో పాటుగా అవసరమైన అఫిడవిట్ (అనెక్షర్ డీ) సమర్పించాల్సి ఉం టుంది. బాల ఆధార్‌లోని బేబి ఆఫ్ స్థానంలో పిల్లల పేరు నమోదు చేసేందుకు ఐడెటింటి ప్రూఫ్, రిలేషన్‌షిప్ (బంధుత్వం) ప్రూఫ్ సమ ర్పించాలి. అలాగే ఉరఫ్/అలియాస్ తొలగించు కునేందుకు మేజర్లయితే సంబంధిత గుర్తింపు పత్రంతో పాటుగా ఐడెంటిటీ ప్రూప్, అనెక్షర్ ఈ అఫిడవిట్ సమర్పించాలి. అలాగే మైనర్లు అయితే సంబంధిత గుర్తింపు పత్రంతో పాటు గా ఐడెంటిటీ ప్రూఫ్, రిలేషిన్‌షిప్‌ప్రూఫ్‌తో పాటుగా అనెక్షర్-ఎఫ్ అఫిడవిట్ సమర్పించాలి.
వివరాల నమోదు లోపాలు..
ఆధార్ నమోదు సందర్బంలో సరైన పత్రాలు ఇచ్చినప్పటికీ వివరాలు నమోదు చేసేటపు డు అక్షర దోషాల కారణంగా ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా పడితే సవరించుకోవచ్చు. ఇందుకు పెద్దలు సంబంధిత అఫిడవిట్ (అనె క్షర్ బీ) తో పాటుగా ఐడెటింటీ ప్రూఫ్, రిలేషిన్ షిప్ ప్రూఫ్ సమర్పించాలి. మైనర్ల డేటా తప్పుల సవరణకు ప్రత్యేకమైన మైనర్ అఫిడవిట్ (అనెక్షర్ సీ) సమర్పించాలి.
భాషా మార్పులు
ఆధార్‌లో పేరు, చిరునామా వివరాలు ఇంగ్లీష్‌తో పాటుగా తెలుగులో కుడా ఉంటాయి. అయితే ఇంగ్లీష్‌లో పేరు సరిగ్గా ఉండి తెలుగు లో తప్పుగాఉంటే సంబంధిత గుర్తింపు పత్రం, అఫిడవిట్ సమర్పించితే సవరించుతారు.
పేరు మార్పుకు గెజిట్
ఆధార్‌లోని వ్యక్తి పేరును పూర్తిగా మార్చా లంటే మాత్రం తప్పనిసరిగా పేరు మార్చినట్లు గా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్ కావాలి. ప్రభుత్వ గెజిట్‌నోటిఫికేషన్ సమర్పించిన వారి కే గెజిట్‌లో ఉన్నట్లుగా పేరు మారుస్తారు. అయితే పేరు మార్పు అనేది ఒకసారి మాత్రమే.
కేంద్రానికి వెళ్లాల్సిందే..
ఆధార్‌లోని పేరు, ఇంటిపేరు, చిరునామా వివరాలు (డెమోగ్రఫిక్ వివరాలు) స్పెల్లింగ్, భాషపరమైన తప్పులు, ఇంటి పేరు మార్పుల తో పాటుగా పేరు మార్చులు చేసుకోవాలంటే సంబంధిత డాక్యుమెంట్లు, అఫిడవిట్‌లతో ఆధార్‌సేవా కేంద్రానికి స్వయంగా వెళ్లాలి. అలాగే ఈ వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు బయోమెట్రిక్ అథంటిఫికేషన్ పూర్తిచేశాక సంబంధిత డాక్యుమెంట్లు, అపిడవిట్లు సమర్పించి రు.75 చెల్లిస్తే సవరణలు చేస్తారు. ఆధార్ సేవా కేంద్రంలో సవరణలు చేశాక వారం నుంచి నెలరోజుల లోపు మొబైల్‌కు అప్‌డేట్ చేసినట్లుగా మెసేజ్ వస్తుంది. అలాగే తప్పులు, పొరపాట్లు సవరణ చేసిన ఆధార్ కార్డు ఇంటికి పోస్టులో వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట
దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్.. వెయిటింగ్ లిస్టు కష్టమే
Read Latest AP News And Telangana News And International News And Telugu News