Share News

అశోక్‌రెడ్డి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వ్యాపార భాగస్వామే సూత్రధారి

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:58 AM

హైదరాబాద్‌లోని గాజులరామారంలో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి అశోక్‌రెడ్డి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆయన భాగస్వామే ఈ కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

అశోక్‌రెడ్డి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వ్యాపార భాగస్వామే సూత్రధారి
business partner role in ashok reddy kidnapping

హైదరాబాద్, అక్టోబర్ 9: నగరంలోని గాజులరామారం నివాసియైన వ్యాపారి అశోక్‌రెడ్డి కిడ్నాప్ కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఆయన వ్యాపార భాగస్వామి అయిన చంద్రశేఖర్ ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం ప్రకారం.. అశోక్ రెడ్డి, ఆయన స్నేహితుడు చంద్రశేఖర్ మూడేళ్లుగా వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చంద్రశేఖర్ తప్పుడు లెక్కలు చూపించి.. తనను మోసం చేశాడని గ్రహించిన అశోక్‌రెడ్డి చంద్రశేఖర్‌ను నిలదీశారు. దీనితో కక్ష పెట్టుకున్న చంద్రశేఖర్.. అశోక్‌ రెడ్డిని సుఫారీ గ్యాంగ్‌‌తో కిడ్నాప్ చేయించాడు. అనంతరం జడ్చర్ల అడవిలోకి తీసుకెళ్లి.. బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. తిరిగి గచ్చిబౌలిలో వదిలేసి పారిపోయారు. ఈ మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.


కాగా.. ఈ నెల 7వ తేదీన అశోక్ రెడ్డి ఆయన పిల్లలను స్కూల్‌లో దించేసి వస్తుండగా.. కారులో వచ్చిన ఐదుగురు దుండగులు అశోక్‌రెడ్డిపై దాడి చేసి, కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అశోక్‌రెడ్డి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్టార్‌లింక్ వివాదంపై రాహుల్ గాంధీకి మస్క్ స్పందన.. 'ఇది నిజంగా ఆందోళనకరం'

మహాత్మా.. మోదీ, జ్ఞానేశ్‌లకు సద్బుద్ధి ప్రసాదించు!

Updated Date - Oct 09 , 2026 | 12:23 PM