Share News

ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ కఠిన వైఖరి.. తన వైన్‌యార్డ్‌లో మాత్రం తక్కువ వేతనానికే విదేశీ కార్మికులు!

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:49 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ వైపు విదేశీ ఉద్యోగులు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తుండగా, ఆయన వ్యాపార సంస్థలకు మాత్రం తక్కువ వేతనాలకే విదేశీ కార్మికులను నియమించుకునేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ కఠిన వైఖరి.. తన వైన్‌యార్డ్‌లో మాత్రం తక్కువ వేతనానికే విదేశీ కార్మికులు!
Trump Winery Foreign Workers

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు విదేశీ ఉద్యోగులు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తుండగా, ఆయన కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ మాత్రం తక్కువ వేతనాలకే విదేశీ కార్మికులను నియమించుకునేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.

వర్జీనియాలోని చార్లోట్స్‌విల్ సమీపంలో ఉన్న 'ట్రంప్ వైన్‌యార్డ్ ఎస్టేట్స్'లో ద్రాక్ష, యాపిల్ తోటల పనుల కోసం గంటకు కేవలం $13.90 (సుమారు రూ. 1,160) చొప్పున వేతనంతో 36 మంది తాత్కాలిక విదేశీ కార్మికులను నియమించుకునేందుకు యుఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తు దాఖలైంది.

2025లో ఈ వైన్‌యార్డ్‌లో గంటకు $15.81 వేతనం చెల్లించగా, 2026 సీజన్ (ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు) కోసం దాదాపు $2 తగ్గించి $13.90 గంటల వేతనాన్ని ఆఫర్ చేశారు. పాత ఉద్యోగులు తిరిగి వస్తే వారికి $16.16 ఇస్తామని దరఖాస్తులో పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి ఉపయోగించే H-2A వీసాల కింద ఈ అప్లికేషన్ పెట్టారు. పండ్ల తోటల్లో కత్తిరింపులు, కోతలు, నిర్వాహక పనులకు అమెరికన్ కార్మికులు సరిపడా అందుబాటులో లేరనే నిబంధనను దీనికి ప్రాతిపదికగా చూపించారు.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 2008 నుంచి ఇప్పటివరకు ట్రంప్ సంస్థలు H-2A (అగ్రికల్చర్), H-2B (రిసార్ట్‌లు, మార్-ఎ-లాగో హోటల్ పనులు) వీసాల ద్వారా కనీసం 2,069 మంది విదేశీ కార్మికులను అమెరికాకు తీసుకొచ్చాయి.

ఐటీ రంగానికి చెందిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వాడే H-1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం లక్ష డాలర్ల అదనపు రుసుములు, కఠిన ఆంక్షలు విధిస్తుంటే.. ఆయన సొంత వ్యాపారాలు వాడే అగ్రికల్చర్/హాస్పిటాలిటీ వీసాలకు మాత్రం రాయితీలు వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి కనీస వేతన లెక్కింపు నిబంధనలను సవరించడం వల్ల అమెరికావ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల వేతనాలు వార్షికంగా సుమారు 9శాతం ($3 బిలియన్లు) తగ్గుతాయని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది.

ఈ కొత్త వేతన నిబంధనలను సవాలు చేస్తూ యునైటెడ్ ఫార్మ్ వర్కర్స్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా, అక్టోబర్ 2న కోర్టు ఈ విధానాన్ని తప్పుబడుతూ డిసెంబర్ 30 నాటికి కొత్త నిబంధనలు రూపొందించాలని స్పష్టం చేసింది. Trump Winery Foreign Workers:


ఈ వార్తలు కూడా చదవండి:

డిసెంబరులో పార్లమెంటు ముట్టడి

శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 12:51 PM